“Book Descriptions: ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఎక్కడయినా ఉంటే అది చిన్నపిల్లల అమాయకపు కళ్ళలోనే! అభం శుభం తేలాయని ఆ పసిమనసుల్లోనే! చందనపు గాలుల్లా నిర్మలంగా ఉండే వారి స్వభావల్లోనే నిష్కల్మషాన్ని పెద్దవాళ్ళ తమతమ స్వార్ధంకోసం విషపూరిత చేస్తుంటారు. ఒకప్పుడు అబద్దాలు ఆడకూడదు అన్న సత్యాన్ని అక్షరాలు దిద్దించిన చెయ్యే తర్వాత అబద్దం చెప్పితీరాలని అదే చెయ్య ఎత్తి శాసించినప్పుడు ఆ పసి మనసు ఏమౌతుంది? ఆ చిన్నారి హృదయం రణరంగంగా మారుతుంది! ఆ కళ్ళలో అమాయకత్వం మాయమై క్రూరత్వం చోటు చేసుకుంటుంది. ఆ పసి మనసులో నుంచి దేవుడు పారిపోయి, దెయ్యం తిష్ట వెయటం జరుగుతుంది.
ఇది ఒక పార్థు కథ! కాదు! పెద్దవాళ్ళ స్వార్థ చింతనలకి నిర్దయగా బలి అయిన అనేక వందల మంది బాలల కథ!” DRIVE