వాళ్లిద్దరూ అంతేనా? [Valliddaru Antena?]



Note: If you encounter any issues while opening the Download PDF button, please utilize the online read button to access the complete book page.
Size | 24 MB (24,083 KB) |
---|---|
Format | |
Downloaded | 626 times |
Status | Available |
Last checked | 11 Hour ago! |
Author | Ranganayakamma |
“Book Descriptions: మాజంలో ఉన్న ఏదైనా ఒక వాస్తవాన్ని యధాతధంగా చూపిస్తే, అది ఒక 'వార్త'! లేదా, ఆ వాస్తవానికి కల్పనల్ని కూడా జోడించి, దాన్ని ఒక కథగా మార్చితే, అది ఒక 'రచన'! ఏ రచన అయినా, వాస్తవాలకు కల్పనలు చేర్చడం ద్వారానే తయారవుతుంది. 'కల్పన' అనేది, వాస్తవాల మీదే ఆధారపడి, వాస్తవాల్ని సమర్థిస్తూ గానీ, తిరస్కరిస్తూ గానీ, సాగుతుంది. ఒక భక్తుడు, రోజంతా పూజలు చేస్తూ, దేవుళ్ళ గురించి కలలు కంటూ గడుపుతున్నాడంటే, అది వాస్తవమే. ఆ పూజలు, జరుగుతూ ఉండేవే. కానీ, ఆ భక్తుడి ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడనీ, భక్తుడు కోరిన వరాలు దేవుడు ఇచ్చాడనీ, కధ రాసేస్తే, అది పండు 'అబద్ధమే' ఈ కల్పనా, వాస్తవం మీద ఆధారపడేది అవదు.
"దేవుడు వరాలు ఇస్తే బాగుండును. అలా జరిగితే బాగుండును" అనే కోరిక అది. ఎన్నడూ ఎక్కడా జరగని కోరిక అది. కానీ, సాంఘిక సమస్యల మీద కల్పనలు అయితే, అటువంటి అబద్దాలుగా ఉండవు. అవి జరగవచ్చు. లేదా 'మన సమస్యల్ని అలా పరిష్కరించుకోవాలి. అది గ్రహించండి!' అని చెప్పే బోధనలుగా అయినా అవి ఉండవచ్చు. 'అవమానాలు' ఎవరికి జరుగుతూ ఉంటాయో వాళ్ళు, ఆ అవమానాల నుంచి బైటపడాలి! ఒక వ్యక్తికైనా, ఒక వర్గానికైనా, అదే పరిష్కారం! కొన్ని దాంపత్య సమస్యలకు మార్పులూ - సంస్కరణలూ, జవాబులు కాలేవు. దూరాలే, వ్యతిరేకతలే, తిరస్కారాలే, ఒంటరితనాలే, ఆత్మగౌరవం గల పరిష్కారాలు అవుతాయి. ఈ కదా వస్తువు అంతా కేవలం నా ఊహ కాదు! అంతా కేవలం నా కల్పనా కాదు! వాస్తవాలు అనేకం ఉన్నాయి. ఈ రచనలో కనపడే సంఘటనలన్నీ కేవలం నా కల్పనలుగా నన్ను సందేహించకండి! నన్ను శంకించకండి!”